తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగ చైతన్య పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ లో నాగార్జున తో కలిసి నటించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తరువాత థాంక్యూ మూవీ లో సోలో హీరో గా నటించాడు. అలాగే అమీర్ ఖాన్ హీరో గా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డ మూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ తో నాగ చైతన్య హిందీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అరవింద స్వామి ... ప్రియమణి ఇతర ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇళయరాజా ,  యువన్ శంకర్ రాజా ఈ క్రేజీ మూవీ కి సంగీతం అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తాజా షెడ్యూల్ ఈ రోజు నుండి హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్లో చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: