ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి రెండు సినిమాలతోనే మంచి హిట్ ను అందుకున్న ప్రభాస్ దాని అనంతరం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను అందుకున్నాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలోని భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోగా నిలిచాడు ప్రభాస్.ప్రస్తుతం ప్రభాస్ ఒక్క సినిమాకి గాను వంద నుండి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. 

ప్రభాస్ కి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ప్రభాస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇక ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో వారి అభిమానులు దాటికి ఆహా వారి యాప్ కూడా క్రాష్ అయ్యింది.అందరూ ఒకేసారి ఈ యాప్ ని ఓపెన్ చేయడంతో యాప్ క్రష్ అయింది. అయితే ప్రభాస్ ది రాజుల కుటుంబం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. సాధారణంగా ప్రభాస్ ఇంటికి ఎవరు వచ్చినా కూడా రకరకాల వంటలు చేసి వారి కడుపు నింపుతూ ఉంటారు.

 ఇక అలాంటి ప్రభాస్ ఒకవేళ సినిమాల్లోకి రాకపోతే కచ్చితంగా హోటల్ బిజినెస్ పెట్టేవాడట. ప్రభాస్ కి ముందు నుంచే బిజినెస్ చేయాలి అన్న ఆసక్తి ఉండేది.  ఇక అప్పటి పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ బిజినెస్ ను పెట్టలేకపోయాడు ప్రభాస్.దాని అనంతరం సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుండి వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపును పొందాడు. ఇప్పుడు ప్రభాస్కి ఉన్న ప్రాపర్టీని బట్టి చూస్తే ప్రభాస్ ఎన్ని హోటల్లో బిజినెస్ లు అయినా పెట్టే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: