సౌత్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది త్రిష. అయితే గతంలో ఈమె వరుస  సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగినప్పటికీ గత కొంతకాలంగా ఈమె కెరియర్ డౌన్ అయింది అని చెప్పాలి. ఇక అలాంటి నేపథ్యంలో మణిరత్నం రూపొందించిన పొన్నియ న్సెల్వన్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించింది త్రిష. కుందవై పాత్రలో అద్భుతంగా నటించి మంచి ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాతో వరుస ఆఫర్లను అందుకుంటుంది త్రిష. గత కొంతకాలంగా ఆఫర్లు లేకుండా డౌన్ అయిపోయిన త్రిష ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. 

సినిమా పూర్తయిన అనంతరం స్టార్ హీరోల సరసన నటించేందుకు రెడీ అయ్యింది. అయితే గత కొంతకాలంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం దళపతి విజయ్ కి జోడిగా ఒక సినిమాలో త్రిష నటించనుందని సమాచారం .ఈ నేపథ్యంలోనే అజిత్ కుమార్ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని త్రిష దక్కించుకుంది అని తెలుస్తుంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ మరియు అజిత్ కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే మొదటగా త్రిషను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు.

ఈ విషయాన్ని త్రిష తో చర్చలు కూడా జరపాలని భావించారు. ఇంతలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష కు బదులు కాజల్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. గతంలో అజిత్ మరియు కాజల్ కాంబినేషన్లో తెరకెక్కిన వివేకం సినిమాలో వీరిద్దరి జంట అందరినీ ఆకట్టుకుంది.ఈ నేపథ్యంలోనే అజిత్ కి జోడిగా కాజల్ ఉంటే బాగుంటుంది అని భావిస్తున్నారు. దీంతో ఈ వార్త విన్న చాలామంది త్రిషకు చేతిదాకా వచ్చిన ఆఫర్ ను కాజల్ దక్కించుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కాజల్ విషయానికొస్తే ఇటీవల తన స్నేహితుడిని పెళ్లి చేసుకుని తాజాగా ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది కాజల్. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి తల్లిగా కొనసాగుతోంది కాజల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: