అదృష్టం అంటే రష్మికదే. అంత నటన, అందం లేకపోయినా తన హాట్ నెస్ తో బాగానే నెట్టుకొస్తుంది. పైగా ఈమె తెలుగులో చేసిన సినిమాలు మాక్సిమం బాగానే హిట్ అయ్యాయి. అది డైరెక్టర్ లు ఇంకా స్టార్ హీరోల పుణ్యం కావచ్చు. అయితే ఏమాత్రం టాలెంట్ లేకపోయినా కూడా రష్మికకి మాత్రం ఫుల్ గా అవకాశాలు వస్తున్నాయి. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు, తమిళ  అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న రష్మిక,ఇక నార్త్ లో కూడా జెండా పాతాలని చాలా గట్టిగా ప్లాన్ చేస్తోంది. అయితే అవకాశాలు వచ్చినా కూడా ఆమెకు వర్కౌట్ అవ్వట్లేదు.బాలీవుడ్ సీనియర్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ తో నటించినా కూడా రష్మిక కెరీర్ లో ఊపు రావట్లేదు. ప్రస్తుతం రష్మిక ఆశలు అన్నీ ‘మిషన్ మజ్ను’ సినిమాపైనే ఉన్నాయి.


యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ  ‘స్పై యాక్షన్ థ్రిల్లర్’ మూవీ జనవరి 20న డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.ఇక ‘మిషన్ మజ్ను’ సినిమా టీజర్ ని మేకర్స్ లాంచ్ చేశారు. దాదాపు నిమిషమున్నర నిడివితో కట్ చేసిన టీజర్ బాగానే ఆకట్టుకుంది, విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి.ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య 1971 నేపధ్యంలో జరిగిన యుద్ధ నేపధ్యంలో ఈ ‘మిషన్ మజ్ను’ సినిమా తెరకెక్కింది. శాంతను భగ్చీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డైరెక్ట్ ఒటీటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఒటీటీలో ‘మిషన్ మజ్ను’ని ఆడియన్స్ ని విపరీతంగా చూడాలి. ఒకవేళ చూసినా వాళ్లకి రష్మిక క్యారెక్టర్ అయితే నచ్చాలి… అప్పుడు కానీ ఆమె కెరీర్ మరలా స్పీడ్ అందుకోదు. పొరపాటున ‘మిషన్ మజ్ను’ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వస్తే మాత్రం రష్మిక కెరీర్ పోవాల్సిందే.మరి ‘మిషన్ మజ్ను’ రష్మిక బాలీవుడ్ కెరీర్ ని మారుస్తుందా లేక మరింత ట్రబుల్ లోకి నెడుతుందా? అనేది మున్ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: