తెలుగు సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ తమన్నా. గత కొద్దిరోజులుగా ఎక్కువగా ఈమె గురించి మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అది కూడా కేవలం పెళ్లి, ప్రేమ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో తమన్నా అభిమానులు మాత్రం కాస్త నిరుత్సాహ పడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ రూమర్స్ రావడంతో ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లుగా గడిచిన కొద్దిరోజుల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని అభిమానులు సైతం చాలా సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


తమన్నా ,విజయ్ వర్మల ప్రేమ వ్యవహారం రోజు రోజుకి వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా వీరిద్దరికి సంబంధించి ఒక ఫోటో కూడా లీక్ అయిందని వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటో వైరల్ గా మారడంతో వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ప్రేమ ఉందని పలువురు నెటిజన్లు సైతం అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటివరకు మాత్రం తమన్నా ఈ విషయం పైన ఏ విధంగా స్పందించలేదు. న్యూ ఇయర్ పార్టీని ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారని సన్నిహితులు ఈ ఫోటోని లీక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


దీంతో సోషల్ మీడియాలో తమన్నా మరియు విజయ్ వర్మలకు సంబంధించి న్యూ ఇయర్ ఫోటోలను  నేటిజెన్లు కాస్త శ్రద్ధ పెట్టి చూస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వీరు హింట్ వదిలిపెట్టినట్లుగా ఆనవాళ్లు కనిపించలేదు. తమన్నా తన ప్రేమ విషయం గురించి అతి త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని పలువురు అభిమానుల సైతం ఎదురుచూస్తున్నారు. దాదాపుగా 20 సంవత్సరాలుగా తమన్న స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు ఇప్పుడు ఈమె హవా కాస్త తగ్గడంతో త్వరలోనే పెళ్లి పీటలు లేకపోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై తమన్న ఎలా స్పందిస్తుందో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: