సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో నటుడిగా ఎదగాలి అంటే మాత్రం ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది అన్నది ఇప్పటి వరకు ఎంతో మంది నటులు వారి కష్టాలను చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది.  అవకాశాల కోసం తిరుగుతూ కడుపు మాడ్చుకుని ఎదురుచూసి ఇక ఆ తర్వాత నటులుగా క్లిక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ కూడా ఒకరు అని చెప్పాలి. అయితే విక్రమార్కుడు సినిమాలో టిట్ల అనే ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించిన అజయ్ ఒకసారి గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.


 ఇక తర్వాత కాలంలో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించడమే కాదు ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు అని చెప్పాలి. అయితే ఇక సినిమా ఇండస్ట్రీలో బాగా క్లిక్ అయిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ తన జీవితంలో ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడట. ఒకానొక సమయంలో ఏకంగా హోటల్లో ప్లేట్లు కడగాల్సిన పరిస్థితి కూడా వచ్చిందట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు అన్నింటిని కూడా చెప్పుకొచ్చాడు అజయ్. ఒకానొక సమయంలో నేపాల్ కు వెళ్ళినప్పుడు ఇక అక్కడ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయట.


 ఇక అలాంటి సమయంలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలియక అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడట.  డబ్బులు లేకపోతే మళ్లీ ఇండియాకు ఎలా రావాలో తెలియక.. ఒక టిబెటన్ రెస్టారెంట్లో కూడా పనిచేశాడట. ఇక అక్కడ కస్టమర్లు తిన్న ఎంగిలి ప్లేట్స్ గిన్నెలు కూడా కడిగాను అన్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అజయ్. ఇక డబ్బు తన దగ్గర ఉన్నంతవరకు వాటి విలువ తెలియని.. డబ్బు లేకపోతే వాటిని సంపాదించడానికి కష్టం చేయక తప్పదు అంటూ అజయ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు విలన్ పాత్రలో నటించిన చాలాసార్లు కూడా తనకు ఎన్నో గాయాలు అయ్యాయి అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: