తమిళ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి అజిత్ తాజాగా తునివు అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ ని తెలుగు లో తెగింపు పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు భాషలలో నిన్న అనగా జనవరి 11 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయింది. అందులో భాగంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిందో తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ మూవీ కి నైజాం ఏరియాలో 95 లక్షల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ లో 21 లక్షలు ... ఆంధ్ర లో 1.02 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.14 కోట్ల షేర్ ...  2.18 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


మూవీ 3.50 కోట్ల షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ మూవీ కనుక మరో 2.36 కోట్ల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసినట్లు అయితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి. ఈ క్రేజీ మూవీ లో మంజు వారియర్ ఒక కీలకమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: