తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరో తెలుగు లో పందెం కోడి మూవీ ద్వారా మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. పందెం కోడి మూవీ తర్వాత విశాల్ దాదాపు తాను నటించిన ప్రతి మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే విశాల్ ఆఖరుగా అభిమన్యుడు మూవీ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా ఉంటే తాజాగా విశాల్ "లాఠీ" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు  సునైనా హీరోయిన్ గా నటించిన మూవీ కి ఏ వినోత్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , హిందీ , మలయాళ భాషల్లో ఒకే రోజు విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

మూవీ లోని యాక్షన్ సన్నివేశాలు బాగా ఉన్నప్పటికీ ఇతర విషయాలు బాగా లేవు అనే టాక్ వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. జనవరి 14 వ తేదీ నుండి ఈ మూవీ ని సన్ నెక్స్ట్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: