ఈసారి సంక్రాంతికి చిరంజీవి బాలకృష్ణల భారీ మాస్ సినిమాలతో పాటు తమిళ టాప్ హీరోలు విజయ్ అజిత్ ల సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో ఏఒక్క టాప్ హీరో సినిమాకు సరైన సంఖ్యలో ధియేటర్లు దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఒక చిన్న సినిమా ఈసంక్రాంతి రేస్ లో తానున్నాను అని చెప్పడమే కాకుండా ప్రకటించిన ప్రకారం ఆమూవీ భోగి పండుగ రోజు అయిన జనవరి 14న విడుదల అవుతున్నట్లుగా చేస్తున్న పబ్లిసిటీని చూసి ఈమూవీ మనోధైర్యం చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.



సెన్సిబుల్ కథలతో సినిమాలుగా వచ్చిన చిన్న సినిమాలు గతంలో ఎవరు అనుకోని ఊహించని విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే జరగబోతోందా అంటూ కొందరు ఊహాగానాలు మొదలుపెట్టేసారు. దర్శకుడు శోభన్ కొడుకు సంతోష్ శోభన్ కు వరసపెట్టి అవకాశాలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు అతడికి హిట్ అన్నపదం అతడిని టచ్ చేయలేదు.



అలాంటి పరిస్థితులలో ఉన్న ఒక యంగ్ హీరోసంక్రాంతి రేస్ లోకి రావడం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. ఉద్యోగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న నిరుద్యోగికి ఇగో సమస్యతో భార్యతో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడినప్పుడు వచ్చే సమస్యలు చుట్టూ ఈమూవీ కథ ఉంటుంది అని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ అనీల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి సంబంధించిన ఒక పాటను లేటెస్ట్ గా విడుదల చేసారు.



'అయ్యో ఎంటో నాకు అన్ని వచ్చి పక్కనున్న ఒక్క అదృష్టమేమో దూరముందే అన్నీ ఇచ్చేసినట్టు ఇచ్చి లాగేసుకుంటు దైవం వైకుంఠపాళీ ఆడతాడే' అంటూ సాగిన ఈపాట పూర్తి మెలోడీగా ఉండటంతో టాప్ హీరోలు మాస్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ విని తెగ బోరు ఫీల్ అవుతున్న సగటు ప్రేక్షకుడుకి ఈమూవీ రిలీఫ్ గా మారుతుందా అన్న అంచనాలు ఉన్నాయి. ప్రియా భవాని హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈమూవీ హిట్ అయితే సంతోష్ శోభన్ కు దశ తిరిగినట్లే అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: