టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈమధ్య పాన్ ఇండియా హీరోగా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా తనకు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది .ఇక ఇటీవల టాలీవుడ్లో స్టార్ హీరోలుగా పేరుపొందిన ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇద్దరూ కూడా తమ భార్యలతో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్లో ఒకేలా కాస్ట్యూమ్స్ మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేసుకున్నారు.ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా అందరికంటే కాస్త ముందుగానే ఉందని చెప్పవచ్చు. ఈమె చాలాకాలంగా సపరేట్ ఇమేజ్ కోరుకుంటోంది . అనూహ్యంగా గ్లామర్ క్విన్ గా అవతారమెత్తి ఒకసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటోలు సైతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొత్తం ఇండస్ట్రీ దృష్టి అంత ఈమె వైపే ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జూవాల్కర్ డిజైన్ చేసిన ఈ చీరల స్నేహ రెడ్డి చాలా అద్భుతంగా కనిపిస్తోంది.
డీప్ నెక్ జాకెట్ ధరించి మెస్మరైజింగ్ ఫోటోలతో స్నేహ రెడ్డి అటు అభిమానులను కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి ఏకంగా 8.3 మిలియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. స్నేహ రెడ్డి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు కానీ ఇచ్చి ఉంటే కథ వేరే లాగా ఉండేది అంటే పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. స్నేహ రెడ్డి టాప్ టు బాటమ్ హీరోయిన్ మెటీరియల్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం స్నేహారెడ్డి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ విషయంపై ఎప్పుడూ కూడా స్పందించలేదు స్నేహారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: