టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నిన్న వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టాడు. పండగ కానుకగా వచ్చిన మెగాస్టార్ సినిమా చాలా మంచి టాక్ తెచ్చకుంది. వింటేజ్ చిరుని చూసి ఆయన ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు.అప్పట్లానే చిరంజీవి గ్రేస్ అదిరిపోయేలా ఉందని అభిమానులు చెప్తున్నారు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అయితే అభిమానులు అదరహో అంటున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ అభిమానులు కూడా తమకు కావాల్సిన ఐ ఫీస్ట్ దొరికిందని చెబుతున్నారు. ఎప్పుడో అన్నయ్య సినిమాలో మెగాస్టార్ ని , మాస్ మహారాజాను స్క్రీన్‌పై చూశామని.. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత వారిని సిల్వర్ స్క్రీన్‌పై కలిసి చూడటం నిజంగా కన్నుల పండుగగా ఉందంటున్నారు. మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సత్తా చాటాడు చిరంజీవి.ఈ సినిమా శుక్రవారం నాడు రూ.30 కోట్లు (అన్ని భాషలతో కలిపి) వసూళ్లు రాబట్టింది.


2022లో విడుదలైన చిరంజీవి గాడ్‌ఫాదర్ కంటే వీరయ్య వసూళ్లు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు కేవలం రూ. 13 కోట్లు మాత్రమే రాబట్టింది.కెఎస్ రవీంద్ర డైరెక్ట్ చేసిన వాల్తేర్ వీరయ్య సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో శృతి హాసన్ చిరుకి జోడిగా నటించింది. అలాగే కేథరిన్ థ్రెసా.. రవితేజ్ జంటగా నటించి మంచి నటన కనపబరిచింది. ఇక శుక్రవారం నాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానుల హంగామా ఒక రేంజిలో నడిచింది.అయితే వాల్తేర్ వీరయ్య సినిమా విడుదల నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి కలెక్షన్స్‌పై భారీగా ఎఫెక్ట్ చూపించింది. గురువారం నాడు ఏకంగా రూ. 34 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన వీర సింహారెడ్డి శుక్రవారం నాడు కేవలం రూ.9కోట్లు మాత్రమే వసూలు చేసింది. పండుగ సీజన్ కావడంతో ఈ రెండు సినిమాలు త్వరగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తమిళ హీరో విజయ్ వారసుడు సినిమా రిలీజయినప్పటికీ దాని స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: