టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దసరా'. సింగరేణి బ్యాక్ గ్రౌండ్ లో రాబోతున్న ఈ సినిమాని మార్చి 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేట్రికల్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించడం జరిగింది.ఇక ఈ సినిమాలో నానికి జంటగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో తన లుక్‌ అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది.. ఈ మూవీ ప్రమోషన్ మెటీరియల్‌కి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ధూమ్ ధామ్ పాటకు అయితే చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఇటీవలే దసరా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.ఇంకా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని చాలా దూకుడుగా చేస్తోంది.ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ మూవీని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.


ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్ ఇంకా అలాగే జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనుండగా.. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.ఈమధ్యనే సెట్స్ నుంచి కీర్తిసురేష్ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ముఖ్యంగా నాని లుక్ అయితే అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది.తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ ఇంకా మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఓటీటీ పార్టనర్ కూడా ఫిక్స్ అయ్యింది.ఇంకా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఫేమస్ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దసరా పోస్టర్ ను కూడా షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: