మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా , క్యాథరిన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. మాస్ మహారాజ రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , ప్రకాష్ రాజ్ , బాబి సింహ విలన్ పాత్రలలో నటించారు. శ్రీనివాస్ రెడ్డి , షకలక శంకర్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి ఓవర్సీస్ లో కూడా సూపర్ కలక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఏరియా వైస్ గా ఓవర్సీస్ లో ఏ రేంజ్ కలెక్షన్.లు దక్కయో తెలుసుకుందాం.

యూఎస్ఏ లో 14.21 కోట్ల కలెక్షన్ లు దక్కగా , ఆస్ట్రేలియాలో 1.21 కోట్లు , న్యూజిలాండ్ లో 8.9 లాక్స్ ,  యూకే లో 1.29 కోట్లు ,  యూఏఈ లో 1.05 కోట్లు ,  52 లక్షలు , రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ఒక కోటి కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి 19.4 కోట్ల కలెక్షన్ లభించాయి. ఫస్ట్ వీకెండ్ లో వాల్తేరు వీరయ్య మూవీ కి ఓవర్సీస్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: