యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. కొంతకాలం క్రితమే జూనియర్ ఎన్టీఆర్ , దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇలా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన మూవీలలో ఒకటి అయినటువంటి సింహాద్రి సినిమా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో భూమిక చావ్లా , అంకిత హీరోయిన్ లుగా నటించగా  నాజర్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ మూవీ కి , ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ 9 జులై 2003 వ సంవత్సరం విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా ఆ సమయంలో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఈ మూవీ ని తిరిగి మళ్లీ 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20 వ తేదీన ఈ మూవీ ని 4 కే వర్షన్ తో దియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: