
ఇక శ్రీముఖి ఎలాంటి షోలో యాంకరింగ్ చేసిన సరే తన అల్లరి చేష్టలతో తన వాక్చాతుర్యంతో షోను ఎంటర్టైనింగ్ గా మార్చగలదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి చలాకీ తనమేనేమో ఇక శ్రీముఖికి వరుసగా అవకాశాలు వచ్చేలా చేస్తూ ఉన్నాయి. ఇకపోతే ఇటీవల అందాల తార, డాన్స్ ఐకాన్, స్టార్ మా పరివారం, మిస్టర్ అండ్ మిసెస్, సారంగదరియా షోలకు యాంకరింగ్ చేస్తుంది.. ఇకపోతే ఇటీవల స్టార్ మా పరివారం నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర ప్రేక్షకులు అందరిని ఎంతగానో ఆకట్టుకున్న డాక్టర్ బాబు, వంటలు అక్క గెస్ట్ లుగా వచ్చారు.
అయితే ఇక ఈ ప్రోమోలో చూసుకుంటే వేదిక మీదికి ముందుగా డాక్టర్ బాబు వస్తాడు. ఇక ఆ తర్వాత వంటలక్క వస్తూ వస్తూ.. నేను లేనిది చూసి లైన్ వేస్తున్నావా అంటూ డాక్టర్ బాబుని ఉద్దేశించి అంటూ ఇక స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తుంది. ఇంతలో శ్రీముఖి కలుగజేసుకొని నన్నయితే ఇలా హగ్ కూడా చేసుకున్నాడు అంటూ ఏకంగా వంటలక్క ముందే డాక్టర్ బాబును గట్టిగా హత్తుకుంటుంది శ్రీముఖి. ఇక దొరికిందే చాన్స్ అన్నట్లుగా అటు డాక్టర్ బాబు కూడా శ్రీముఖిని గట్టిగా హాగ్ చేసుకుంటాడు. అయితే ఇది మాత్రం ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు. మరీ ఇంత ఓవర్ యాక్టింగ్ అవసరమా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.