బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా పఠాన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా , దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి జాన్ అబ్రహం ఈ మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీని ఈ సంవత్సరం జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఈ మూవీ యూనిట్ ట్రైలర్ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం , అలాగే ఈ ట్రైలర్ ద్వారా ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని తెలియడంతో ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. 

అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను  కూడా ఈ చిత్ర బృందం లాక్ చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమాను ఈ మూవీ యూనిట్ 146 నిమిషాల 16 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ కి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే జనవరి 25 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: