మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయని తన ఖాతాలో వేసుకున్నాడు చిరంజీవి. బాబి దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మరొ కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ తదితరులు కీలక పాత్రలో నటించిన జరిగింది. ఇక సంక్రాంతి కానుకగా ఈనెల 13న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది.

ఇప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాల ఫ్లాప్ ల అనంతరం ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగా ఆయన సినిమా గురించి చాలా విషయాలను చెప్పుకొచ్చాడు. సినిమా పరంగానే కాకుండా ఆయన వ్యక్తిగత విషయాల గురించి కూడా తన అభిమానులతో పంచుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ నేపథ్యంలోనే తన కోడలు ఉపాసన  డెలివరీ ఎప్పుడో కూడా చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక తన కోడలు తల్లి కాబోతుంది అన్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా

 తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. వీరిద్దరి పెళ్లి దాదాపు 10 ఏళ్లు గడిచిన అనంతరం రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అవుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న మెగా అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఉపాసన శుభవార్త చెప్పిన అనంతరం మా కుటుంబంలో చాలా ఆనందం నెలకొంది అని.. అంతేకాదు ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ఉపాసన డెలివరీ ఉంటుంది అంటూ చెప్పడం మెగాస్టార్ చిరంజీవి. దీంతో ఈ వార్త విన్న మెగా అభిమానులు ఆగస్టు 22వ తేదీన మెగా వారసుడు పుడితే బావుంటుంది అని భావిస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే కాబట్టి. ఆ రోజే మెగా వారసుడు పుడితే బాగుంటుంది అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: