
ఈ క్రమంలోనే దాదాపు కొన్ని సంవత్సరాలు తర్వాత బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు విజయ్ ఆంటోనీ. ఈ సినిమా షూటింగ్లో భాగంగా కొన్ని సన్నివేశాలను మలేషియాలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అని.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని.. గత రెండు రోజుల నుంచి కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళితే మలేషియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు విజయ్ ఆంటోనీ ఉన్న బోట్ ను మరొక బోట్ ఢీ కొనడంతో ఎగిరి కింద పడినట్లు సమాచారం . అదే సమయంలో ముఖానికి గాయాలు తగిలాయి అని.. పళ్ళు, దవడ ఎముకలు విరిగాయి అని వైద్యులు నిర్ధారించినట్లుగా కూడా వార్తలు వినిపించాయి
అంతేకాదు ముఖానికి సర్జరీ కూడా చేయాలి అంటూ వచ్చిన వార్తలలో ఎటువంటి నిజాలు లేవు అని తాజాగా డాక్టర్ సుశీంద్రన్ స్పష్టం చేశారు.విజయ్ ఆంటోని చెన్నైకి తిరిగి వచ్చారని, అతను పూర్తి విశ్రాంతిలో ఉంటాడని, త్వరలో షూటింగ్‌లో జాయిన్ అవుతాడని డాక్టర్ సుశీంద్రన్ క్లియర్ చేశారు. మీడియా తప్పుడు వార్తలను మానుకోవాలని ఆయన కోరారు. మొత్తానికైతే విజయ్ ఆంటోనీ ఆరోగ్యం కుదుటపడిందని తెలిసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆయన త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు అని సమాచారం.