
లైగర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తక్కువగా కనిపిస్తూ ఉన్నారు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా ఈ నటుడు స్టైల్ కి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు యాడ్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాలో హీరోగా నటిస్తున్నారు.ఇందులో హీరోయిన్గా సమంత నటిస్తోంది. అయితే సమంత హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడం జరిగింది. దీంతో ఈ సినిమా అనుకున్న తేదీలో విడుదల కాలేకపోయింది. ఈనెల చివరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే తన తదుపరి చిత్రాన్ని జెర్సీ ఫ్రేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో ఒక సినిమాని ఓకే చేశారు. ఈ సినిమాని వాస్తవానికి రామ్ చరణ్ తో తీయాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ దాదాపుగా రూ.43 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఇప్పటివరకు రూ.15 కోట్లు అందించినట్లు సమాచారం. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.