
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుని ఇక ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతూ ఉంది. అయితే ఈ సినిమాలో రష్మిక చేసిన పాత్ర మాత్రం అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. సాధారణంగా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే రష్మిక సినిమా ఓకే చేస్తుంది. కానీ వారసుడు సినిమాలో కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే రష్మిక పాత్ర ఉంది. అంతేకాదు కేవలం పాటలకు మాత్రమే రష్మిక పాత్ర పరిమితం అయింది అని చెప్పాలి. దీంతో ఫాన్స్ అందరు నిరాశకు గురయ్యారు.
ఇకపోతే వారసుడు సినిమాలో తన పాత్ర గురించి ఇటీవల తొలిసారి స్పందించింది రష్మిక మందన్న. ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కేవలం దళపతి విజయ్ కోసమే ఈ సినిమా ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఇలాంటి సమాధానం ఇచ్చింది. ఇది కేవలం నా సొంత నిర్ణయం మాత్రమే. నా ఇష్టప్రకారమే ఒప్పుకున్న.. విజయ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశ ఎప్పుడూ ఉండేది. అందుకే పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. ఇక షూట్ జరుగుతున్న సమయంలో విజయ్ కి కూడా సరదాగా ఈ విషయాన్ని చెబుతూ ఉండేదాన్ని అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.