బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బోనీ కపూర్‌ కూతుళ్లు మరియు కొడుకు గురించి తెలిసిందే.

ఆయన ప్రేమ, పెళ్లిళ్ల విషయాలు కూడా తెలిసిందే. అయితే శ్రీదేవీ ఉన్నంత కాలం అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌లకు, జాన్వీ, ఖుషి కపూర్‌ల మధ్య అంత సన్నిహిత సంబంధాలు అయితే ఉండేవి కాదు. శ్రీదేవీ చనిపోయిన తరువాతే వీరి మధ్య కాస్త బంధం బలపడినట్టు అయితే కనిపిస్తోంది.

అర్జున్ కపూర్ తన సొంత చెల్లి అన్షులాను చూసినట్టుగానే జాన్వీ మరియు ఖుషీలను దగ్గరకు తీసుకున్నాడు. వీరంతా కలిసి బాగా చిల్ అవుతుంటారు. అన్షుల కాస్త లావుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అన్షులా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా అన్షులా ఇన్ స్టాగ్రాంలో తన అభిమానులతో చాట్ చేసింది.

జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఎప్పుడైనా మీ డ్రెస్సులు ఎక్స్ చేంజ్ చేసుకున్నారా? అని అడిగాడటా.. దీనికి అన్షులా ఈ విధముగా సమాధానం ఇచ్చింది. నాకు కూడా వాళ్ల డ్రెస్సులు వేసుకోవాలని అయితే ఉంటుంది.. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. నాకు అవి అస్సలు పట్టవు.. ఎప్పడైనా జాన్వీ కపూర్ మా ఇంటికి వస్తే మాత్రం నా బట్టలు మొత్తం పట్టుకెళ్తుంది.. పైజామాలు, స్వెట్ షర్ట్‌లు ఇలా అన్నీ కూడా పట్టుకెళ్తుంటుంది.. అని జాన్వీ కపూర్ గురించి చెప్పుకొచ్చిందటా..

అన్షులా కామెంట్ల మీద జాన్వీ కపూర్ ఈ విధంగా స్పందించింది. వాటిని మళ్లీ ఎప్పుడూ కూడా రిటర్న్ ఇవ్వలేదు అని కౌంటర్ కూడా వేసింది. అంటే జాన్వీ మాత్రం తన అక్క డ్రెస్సులన్నీ బాగా వాడేస్తుందని అందరికీ అర్థమైంది. జాన్వీ కపూర్ నెట్టింట్లో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ కూడా తెలిసిందే. ఎద అందాల ప్రదర్శనతో యూత్‌ను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

జాన్వీ కపూర్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఎక్కడ చూసినా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కనిపిస్తుండటంతో ప్రేమలో ఉన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి.త్వరలోనే జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లోకి రాబోతోన్నట్టుగా కూడా తెలుస్తోంది. కొరటాల శివ మరియు ఎన్టీఆర్ కాంబోలో రాబోతోన్న చిత్రంలో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: