మాస్ మహారాజా రవితేజ తాజాగా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ,  బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని పోయిన సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమాకు లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను నిరాశపరిచిన రవితేజ "ధమాకా" మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ధమాకా మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.

ఈ రోజు నుండి అనగా జనవరి 22 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ఈ మూవీ ని తమ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: