టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత అనారోగ్యం గురించి ఆమె అభిమానులు కంగారుపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సమంత అభిమానులకు ఒక శుభవార్త చెప్పింది. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి నుండి సమంతా పూర్తిగా కోల్కున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ వ్యాధి నుండి కోలుకున్న నేపథ్యంలో సమంత తిరిగి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది. తాజాగా సమంత ముంబైలో జరిగిన సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్ కి హాజరైంది. 

అంతేకాదు ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ మొదలు కాగా సమంత వరుణ్ భావన్ ఇందులో పాల్గొనడం జరిగింది. ఇక సమంతా నటిస్తున్న సిటాడైల్ హాలీవుడ్ సీరిస్ రీమేక్. ఇందులో సమంత మరియు వరుణ్ ధావన్ గూఢచారులుగా కనిపిస్తారని తెలుస్తుంది. కాగా ది ఫ్యామిలీ మెన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చాలా కాలం అవుతున్నప్పటికీ సమంత అనారోగ్యం కారణంగా దీనికి సంబంధించిన షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇందుకోసం సమంత బాగా కష్టపడుతుంది అని తెలుస్తుంది.అంతేకాదు ఆమె యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న చాలా నెలల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది సమంత. ఇటీవల ఆమె నటించిన యశోద సినిమా పూర్తయిన అనంతరం తను మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుంది అన్న విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం సమంత చేతిలో వరుస సినిమాలో ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూటింగ్ కూడా మొదలుకానుందని తెలుస్తుంది. మిగిలిన షూటింగ్ కూడా పూర్తిచేసి ఈ ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు. ఇక విజయ్ దేవరకొండ మరియు సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. తాజాగా సమంత నటించిన శాకుంతల సినిమా కూడా ఫిబ్రవరి 17న విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: