టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇప్పటికే విడుదలైంది. మల్లికా మల్లికా అంటూ సాగే ఈ పాట చాలా మెలోడియస్ గా ఉండి అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఈ పాటలో సమంత చాలా అందంగా కనిపిస్తూ అందరినీ మైమరిపించింది. ఈ పాటలో సమంత అచ్చం దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య లా కనిపించింది. అయితే ఇందులో భాగంగానే ఈ పాటలో సమంత శకుంతల దుష్యంత కోసం అడవిలో అందాల ఆరబోస్తూ విరహవేదన అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తుంది. 

ఈ పాటలో సమంత తన ఎక్స్ప్రెషన్స్ తో చాలా అందంగా ఉంది. ఇక సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది .ఇందులో భాగంగానే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర బృందం .విడుదలైన కొద్దిసేపటికే ఈ సినిమా ట్రైలర్ విశేష స్పందనను అందుకుంది. మహాభారతంలో దుష్యంతుడు మరియు శకుంతల ప్రేమ కథకి ప్రత్యేక స్థానం ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి ప్రేమ కథని ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్ అపురూప దృశ్య కావ్యంగా చూపించాడు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి సినిమాలో నటిస్తుంది అంటే

 ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మరియు పాటలలో సమంత ఎంతటి నటనని కనబరిచిందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ ట్రైలర్లో సమంత నటన చూసి అందరూ ఒక్కసారిగా సమంత నటనకి ఫిదా ఈ సినిమాలో సమంత లుక్స్ మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెకండ్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్ చేశారట చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఈ సాంగ్ ని ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేయనున్నారని ప్రకటించారు. దీంతో సమంత నటిస్తున్న శకుంతలం సినిమాలోని రెండవ పాట కోసం సమంతా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: