
బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా , శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రలలో నటించగా , ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ లో వీర సింహా రెడ్డి మూవీ ప్రపంచవ్యాప్తంగా 68.51 కోట్ల షేర్ , కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
బాలకృష్ణ కొంతకాలం క్రితం అఖండ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా , బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొదటి వారం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసేసరికి 53.49 కోట్ల షేర్ , 87.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇలా బాలకృష్ణ తన ఆఖరి 2 మూవీలతో మొదటి వారం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాడు.