నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఆఖరుగా నటించిన రెండు మూవీలు ఫస్ట్ వీక్ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. మరి బాలకృష్ణ ఆఖరుగా నటించిన రెండు మూవీలు ఏవి ... అవి మొదటి వారంలో ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయో తెలుసుకుందాం.

బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా , శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రలలో నటించగా , ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ లో వీర సింహా రెడ్డి మూవీ ప్రపంచవ్యాప్తంగా 68.51 కోట్ల షేర్ , కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

బాలకృష్ణ కొంతకాలం క్రితం అఖండ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ,  బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొదటి వారం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసేసరికి 53.49 కోట్ల షేర్ , 87.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇలా బాలకృష్ణ తన ఆఖరి 2 మూవీలతో మొదటి వారం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: