
చిరంజీవి తాజాగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జనవరి 13 వ తేదీన విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా , మైత్రి సంస్థ ఈ మూవీని నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.
చిరంజీవి , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన సైరా నరసింహారెడ్డి అనే పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నయనతార , తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్ కలక్షన్లను వసూలు చేసింది.
చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి కొంతకాలం క్రితం వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 మూవీతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ అయినటువంటి ఖైదీ నెంబర్ 150 లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా , దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్ కలక్షన్లను వసూలు చేసింది.