వీర సింహారెడ్డి సినిమా విజయోత్సం వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఒక రేంజిలో వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ పై అక్కినేని వారసులు నాగచైతన్య,  అఖిల్‌ రియాక్ట్ అయ్యారు. ఇద్దరూ కూడా ఒకే సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఎన్టీఆర్‌ గారు, ఏఎన్నార్‌ గారు, రంగారావు గారు కళామతల్లి ముద్దుబిడ్డలనీ, అలాంటి వారిని అవమానించటం అంటే మనల్ని మనమే కించపరుచుకోవటమే అంటూ ఒక ప్రకటనని విడుదల చేశారు. ఎప్పుడూ సరదాగా మాట్లాడే బాలకృష్ణ ఇలా పొరపాటుగానో లేక నోరుజారారో తెలియదుగానీ, టాలీవుడ్‌ దిగ్గజాలపై ఇలా కాంట్రవర్సీ కామెంట్స్‌ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.‘అక్కినేని…తొక్కినేని, ఆ రంగారావు…ఈ రంగారావు’ అంటూ బాలయ్య కామెంట్స్‌ చేశారు. మేం ఎప్పుడు కలిసినా కూడా వాళ్లపైనే టైంపాస్‌ డిస్కషన్స్‌ అంటూ నోరు జారారు బాలయ్య.దీంతో బాలకృష్ణకి కౌంటర్‌గా అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన రియాక్షన్‌ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఈ ప్రకటనలో అక్కినేని అన్నదమ్ములిద్దరూ కూడా చాలా మర్యాదగా స్పందించారు. బాలకృష్ణ ప్రస్తావించిన అక్కినేని, రంగారావు పేర్లతోపాటు ఎన్టీఆర్‌ పేరును కూడా వారు ప్రస్తావించారు. 


మాటకు మాట అన్నట్లుగా కాకుండా స్పందనగా మాత్రమే వీళ్ళ పోస్ట్ కనిపిస్తోంది. బాలకృష్ణ వ్యాఖ్యలను మొదట అక్కినేని ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అయిన సర్వేశ్వరరావు ఖండించారు. అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ ఇలాంటి కామెంట్స్ చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ ఒక ప్రకటనని కూడా విడుదల చేశారు. బాలయ్యది అహంకారపూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తుందని తప్పుబట్టారాయన.ఈ విషయంలో అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ సర్వేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్‌ నుంచి ఇంకా ఆయన కుటుంబం నుంచి స్పందనలు వచ్చాయి కానీ టాలీవుడ్‌ ప్రముఖులు ఎవరూ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ఈ అంశం మరింత వివాదంగా మారకముందే సినీ పెద్దలు అడుగు ముందుకు వేస్తారా అన్నదే ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది. బాలకృష్ణ కామెంట్స్ పై నాగార్జున నేరుగా స్పందించలేదు. నాగార్జున కుటుంబం నుంచి ఆయన ఇద్దరు కొడుకులు మాత్రమే ఇలా స్పందించారు. నాగార్జున స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద హాట్‌టాపిక్‌ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: