రష్మిక మందన చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా లో ఈ అమ్మడి లుక్స్ కి అందరూ కూడా ఫిదా అయిపోయారు. గీత గోవిందం సినిమాతో మంచి ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. నేషనల్ క్రష్ గా అందరిని కూడా ఆకట్టుకుంటుంది రష్మిక.రష్మిక అంటేనే ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యతాను ఇస్తుంది..ఫిట్ గా మరియు సన్నగా ఉండటం వల్లనే తను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారింది.

దానితో పాటు తనకు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. వాటిని సరిగ్గా వినియోగించుకొని ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయింది.

పుష్ప సినిమాలో తన రోల్ కు పడిపోని వాళ్లు అంటూ అస్సలు లేరు. వయ్యారంగా నడుస్తూ తను ఎంతలా కుర్రాళ్లకు దడ పుట్టించిందో అందరికీ కూడా బాగా తెలుసు. ఆ సినిమాతో తన రేంజ్ అంతా మారిపోయింది. ఇప్పుడు తనకు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు కూడా వస్తున్నాయి. పుష్ప 2 సినిమాలోనూ తన రోల్ ఎంతో ముఖ్యమైంది. తాజాగా రష్మిక మందన.. జిమ్ లో కసరత్తులు చేసిన వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియో చూసి నెటిజన్లు అంతా కూడా షాక్ అవుతున్నారు.

ఎందుకంటే ఆ వీడియోలో తన ఎంత కష్టపడుతుందో చూస్తే అసలు రష్మిక అందాన్ని కాపాడుకోవడం కోసం అలాగే ఫిట్ నెస్ కోసం ఇన్ని కసరత్తులు చేస్తుందా అని అందరూ ఆశ్చర్య పోతున్నారు.ఫుట్ బాల్ సైజ్ ఉన్న రెండు బాల్స్ మీద చేతులు అలాగే కాళ్లతో బ్యాలెన్స్ చేస్తూ తను చేసిన కసరత్తు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. నెటిజన్లు అయితే వామ్మో నీ అందం వెనుక ఇంత కష్టం ఉందా  అంటూ నీకు దండం అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ వీడియో  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: