‘చలో’ ‘భీష్మ’ సినిమాల వరస సక్సస్ తో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల కు ఎదురులేదు అని అనుకున్నారు అంతా. దీనికితోడు అతడికి చిరంజీవి వెంకటేష్ ల కాంబినేషన్ లో మొదలుకాబోయే మల్టీ స్టారర్ దర్శకత్వం వహించే అవకాశం లభించింది అని వార్తలు రావడంతో ఈయంగ్ డైరెక్టర్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోతాడు అని భావించారు అంతా. అయితే ఆయంగ్ డైరెక్టర్ ఆశలు నెరవేరలేదు.


అనుకోని కారణాలతో ఈమూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. యంగ్ డైరెక్టర్స్ కు వరసపెట్టి అవకాశాలు ఇస్తున్న చిరంజీవి వెంకీ కుడుమల విషయంలో ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాడు అన్నవిషయమై క్లారిటీ లేకపోయినప్పటికీ ఈయంగ్ డైరెక్టర్ ఆశలు మాత్రం నీరుకారిపోయాయి. గతంలో ‘గాడ్ ఫాదర్’ మూవీ విషయంలో కూడ దర్శకుడు సుజిత్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.


‘లూసీఫర్’ రీమేక్ గా రూపొందిన ఈమూవీ స్క్రిప్ట్ ను సుజిత్ తో చిరంజీవి తయారుచేయించి ఆ స్క్రిప్ట్ మెగా స్టార్ కు నచ్చకపోవడంతో దర్శకుడు సుజిత్ ను తప్పించి మోహన్ రాజాకు చిరంజీవి దర్శకత్వం ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితి వెంకీ కుడుమలకు వచ్చింది అనుకోవాలి. కొంత కాలంక్రితం ఈ యంగ్ డైరెక్టర్ ను మహేష్ తన వద్దకు పిలిపించుకుని ఒక కథ విన్నాడు అని వార్తలు వచ్చినప్పటికీ దానిపై క్లారిటీలేదు.


‘భీష్మ’ విడుదలై మూడు సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ ఈయంగ్ డైరెక్టర్ కు మరొక అవకాశం రాకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈపరిస్థితుల మధ్య ఇతడు ఈమధ్య మళ్ళీ నితిన్ ను కలిసి ఒక కథ చెప్పునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ వరస ఫ్లాప్ ల మధ్య సతమతవుతూ ఉండటంతో వెంకీ కుడుమల చెప్పిన కథ నచ్చినప్పటికీ ఆకథ విషయంలో తన నిర్ణయం చెప్పడానికి ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రెండు హిట్స్ వచ్చి కూడ ఈ యంగ్ డైరెక్టర్ ఖాళీగా ఉండటం ఇండస్ట్రీలో చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: