గత కొంతకాలంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వర్గాల్లో రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉంది అని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటికి ఏమాత్రం అంగీకరించని వీరిద్దరూ కేవలం మేమిద్దరం స్నేహితులమే అంటూ ఆ విషయాన్ని కొట్టి పడేస్తూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన కలిసి దుబాయిలో షికారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన కుటుంబంతో విజయ్ దేవరకొండ దుబాయ్ వెకేషన్ కి వెళ్ళిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది 

ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో రష్మిక మందన కూడా వారితో దుబాయ్ కి వెళ్లడానికి జాయిన్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే వీరిద్దరూ మేమిద్దరం డేటింగ్ లో లేము అని కేవలం మేమిద్దరం మంచి స్నేహితులమే అంటూ ఎప్పటికప్పుడు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ఇద్దరూ వరుస సినిమాలు చేస్తూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో డిజాస్టర్ ని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన బాలీవుడ్లో సైతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.

ప్రస్తుతం రష్మిక మందన చేతిలో పుష్ప 2 సినిమా ఒకటి మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది .ఈ సినిమా అనంతరం బాలీవుడ్ లోనే రష్మిక మందన సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం ఖుషి సినిమా ఉంది. ఆ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ ఒక పోలీస్ ఆఫీసర్ కథతో ఒక సినిమా చేయనున్నట్లుగా సమాచారం.ఎంతో కాలంగా వీరిద్దరి మధ్య ఏదో ఉందని వీరిద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్నారు అన్న వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయాలపై ఎటువంటి క్లారిటీ లేదు. దీంతో మళ్లీ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన కలిసి దొరికిపోయారు అంటూ రకరకాల రూమర్లను స్ప్రెడ్ చేస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: