
ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి హడావిడి లేకుండా తరుణ్ భాస్కర్ నిర్మిస్తున్న ఒక లేటెస్ట్ మూవీ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీగా మారింది. ‘కీడా కోల’ అన్న టైటిల్ తో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న ఆమూవీకి సంబంధించిన ఒక కీలక పోష్టర్ ను బ్రహ్మీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడంతో అది క్షణాలలో వైరల్ గా మారి సోషల్ మీడియాలో నెటిజన్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. ఈమూవీలో హీరో హీరోయిన్స్ ఉండరట.
ఈమూవీ కథలో 8 పాత్రలు కీలకంగా కనిపిస్తాయని తెలుస్తోంది. బ్రహ్మీ పాత్ర ఈ 8 మంది కీలక పాత్రలతోను కనెక్ట్ అయి అడుగడుగునా బ్రహ్మానందం నవ్విస్తాడని అంటున్నారు. ఈమూవీలో బ్రహ్మానందం వరదరాజు పాత్రలో నటిస్తూ ఆమూవీ కథకు కీలకంగా మారతాడని తెలుస్తోంది. ఈమూవీలో బ్రహ్మానందం ఒక ధీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వ్యక్తిగా వీల్ చైర్ తో కనిపిస్తాడని అంటున్నారు. తనకు ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తున్నా ఆవిషయాలను పక్కకుపెట్టి నిరంతరం నవ్వుతూ కనిపించే బ్రహ్మీ పాత్రలో అనేక షేడ్స్ ఉండటమే కాకుండా ఆపాత్రను చూసిన సగటు ప్రేక్షకుడు బ్రహ్మానందం పాత్ర పై జాలిపడతాడని అంటున్నారు.
ఒకప్పుడు టాప్ హీరోలు కూడ తమ డేట్స్ ను బ్రహ్మానందం డేట్స్ తో ఎడ్జెస్ట్ చేసుకోవలసిన పరిస్థితి. అయితే ఇప్పుడు అతడి మ్యానియా కొనసాగాడంలేదు. దీనితో ఈమూవీ సూపర్ సక్సస్ తో తిరిగి బ్రహ్మీ తాను పోగొట్టుకున్న నెంబర్ వన్ కామెడీ స్థానాన్ని తిరిగి పొందే అవకాశం వస్తుందా అంటూ కొందరు ఆశాభావం వ్యక్త పరుస్తున్నారు..
.