టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంది అదితి రావు హైదరి. చాలామంది కి ఈమె హీరోయిన్ గానే తెలుసు. ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. మొదట తమిళ్ సినిమాలతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కార్తీ హీరోగా నటించిన చెలియా సినిమాలతో పరిచయమైన ఈమె నటనకు నచ్చిన మేకర్స్ ఈమెకు వరుస అవకాశాలు ఇవ్వడంతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అనంతరం ఈమె తెలుగులో అంతరిక్షం ,వి, మహాసముద్రం వంటి సినిమాలలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.చాలా సినిమాలలో నటించినప్పటికీ ఈమెకి ఇప్పటివరకు ఒక సాలిడ్ హిట్ పడలేదు. 

ప్రస్తుతం ఏమే తమిళ హీరో లవర్ బాయ్ సిద్ధార్థ తో డేటింగ్ లో ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే తాజాగా వీరిద్దరూ శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలో జంటగా హాజరవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈమెకి ఇంతకుముందే పెళ్లి అయ్యింది అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిష్రా లవ్ మ్యారేజ్ చేసుకుంది ఈమె. పెళ్లయిన మూడేళ్లు తర్వాత ఎవరు ఊహించిన విధంగా విడిపోయారు. వీరిద్దరికీ 2009లో పెళ్లి జరగా 2013లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి జీవితాలతో వారు బిజీగా ఉన్నారు.

అయితే ఈ క్రమంలోనే ఈమె మాజీ భర్త సత్యదీప్ మిశ్రా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన మొదటి భార్య గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. అదితి తో నా రిలేషన్ కారణంగా నాకు ఇప్పుడు ప్రేమ మీద విరక్తి పుడుతుంది. మరోసారి ప్రేమలో పడడం అంటేనే చాలా భయంగా ఉంది.బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్ళు మళ్ళీ రిలేషన్ ప్రేమ అంటే సాధారణంగా భయపడుతూ ఉంటారు. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలమంటూ చెప్పుకొచ్చాడు ఈయన..!!

మరింత సమాచారం తెలుసుకోండి: