ప్రముఖ సింగర్ వాణి జయరామ్ మరణించిన సంగతి ఈ రోజున అందరికీ తెలిసిందే.ఈమె చెన్నైలోని తన నివాసంలో 77 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అయితే వాణి జయరామ్ మృతి పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమె చనిపోయే సమయానికి ముఖం పైన గాయాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ గాయాలు ఎలా అయ్యాయి అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.



వాణి జయరామ్ మరణం పై అనుమానస్పద మృతి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈమె మృతి దేహాన్ని కూడా పోస్టుమార్టం చేయడానికి ఒమేదురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఫారన్సీ నిపుణులు వాణి జయరామ్ ఇంటిని అన్వేషించడం జరిగిందట. దాదాపుగా అరగంట పాటు ఆమె ఇంటిని సోదా చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈమె ఉంటున్న ఇల్లు మొత్తం పోలీసుల ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫారెన్సీక్ నిపుణులు నివేదిక సమర్పించిన తరువాతే ఆమె భౌతిక దేహాన్ని పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వాణి జయరామ్ ది హత్య లేక సహజమరణమ అన్న విషయం తెలియాలి అంటే కాస్త సమయం పడుతుందని తెలియజేశారు.


రిపోర్టర్ వస్తే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది.వాణి జయరామ్ వెల్లూరు ప్రాంతం తమిళనాడులో జన్మించింది. ఈమె కుటుంబ సభ్యులకు కూడా సంగీతం పైన ఎక్కువ ఇష్టం ఉండడంతో చిన్నతనం నుంచి వానికి సంగీతాన్ని నేర్పించారట. మొదటిసారి 1971లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళం తదితర భాషలలో సింగర్ గా మంచి పేరు సంపాదించింది. అలా ఈమె కెరియర్ లోనే దాదాపుగా పదివేలకు పైగా పాటలు పాడినట్లు తెలుస్తోంది. 1969 లో జయరాయ్ అనే వ్యక్తిని ఇమే వివాహం చేసుకుంది. తన భర్త పేరును కలుపుకొని తన పేరుని వాణి జయరామ్ గా పెట్టుకుంది. మరి ఈమె మరణంపై నిపుణులు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: