
ఒక సెలబ్రిటీ చనిపోయారు అని ఆ బాధ నుంచి కోలుకునే లోపే ఇప్పుడు మరొకరు చనిపోతూ బాధను రెట్టింపు చేస్తున్నారు. అలా సినిమా ఇండస్ట్రీలో వరుసగా మరణాలు సంభవిస్తూ ఉండడం బాధాకరమని చెప్పాలి. ఇదిలా ఉండగా ప్రముఖ బహుభాషా నటుడు రేసుగుర్రం విలన్ రవికిషన్ ఇంట్లో కూడా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూ ఆయనను ఒంటరిని చేస్తున్నాయి. ఇప్పటికే రవికిషన్ ఇంట్లో ఒకే ఏడాదిలో తన కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం బాధాకరం. 2022 మార్చి నెలలో రవికిషన్ పెద్ద అన్నయ్య రమేష్ కిషన్ శుక్ల క్యాన్సర్ తో చికిత్స పొందుతూ మరణించగా.. రమేష్ కిషన్ మరణించిన ఏడాదిలోపే ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది.
రవి కిషన్ మరో అన్నయ్య రామ్ కిషన్ కూడా తాజాగా మరణించారు. అయితే ఆదివారం రోజున ఉదయం రామ్ కిషన్ సడన్ కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో ముంబైలో నానావతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రోజు ఆయన మృతి చెందారు. అయితే ఈ విషయాన్ని రవి కిషన్ తాజాగా ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఇలా రాసుకు వచ్చారు. మా పెద్దన్నయ్య రామ్ కిషన్ ఆదివారం గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం . ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చేర్పించాము కానీ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మహాదేవుడు తన పాదాల వద్ద ఆయన ఆత్మకు చోటు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓం శాంతి అంటూ రాసుకు వచ్చారు రవి కిషన్.