
కానీ ఎలాగైనా సరే చిరంజీవి తన మునుపటి వైభవాన్ని పొందాలని డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక డైరెక్టు చిత్రాన్ని తెరకెక్కించారు.అదే వాల్తేరు వీరయ్య.. ఓడరేవు, స్మగ్లింగ్, డ్రగ్స్, బ్రదర్ సెంటిమెంట్ ఇలా అన్నింటిని కలగలిపి ఈ సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అంతేకాదు ఈ సినిమాకి పోటీగా మరో స్టార్ సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా పోటీ వచ్చినప్పటికీ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
సాధారణంగా ఏ సినిమాలైనా సరే థియేటర్లలో సందడి చేసిన ఆరువారాల తర్వాత కచ్చితంగా ఓటీటీ లోకి వస్తాయి. ఈ క్రమంలోని చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నెట్ఫ్లిక్స్ లో వస్తుందని చెప్పారు కానీ ఎప్పుడు వస్తుందని చెప్పలేదు.. ఈ క్రమంలోనే ఒక డేట్ ను కూడా లాక్ చేశారు నిర్వాహకులు. ఈనెల అనగా ఫిబ్రవరి 27వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ కానుంది. మరి సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమా ఏ రేంజ్ లో రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.