మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 6 పదుల వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ రూ.50 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఎప్పటికప్పుడు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఆచార్య సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవి చూసింది. ఆ తర్వాత కొన్ని మార్పులు చేస్తూ గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కించగా పర్వాలేదు అనిపించుకుంది ఈ సినిమా..

కానీ ఎలాగైనా సరే చిరంజీవి తన మునుపటి వైభవాన్ని పొందాలని డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక డైరెక్టు చిత్రాన్ని తెరకెక్కించారు.అదే వాల్తేరు వీరయ్య.. ఓడరేవు, స్మగ్లింగ్, డ్రగ్స్, బ్రదర్ సెంటిమెంట్ ఇలా అన్నింటిని కలగలిపి ఈ సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అంతేకాదు ఈ సినిమాకి పోటీగా మరో స్టార్ సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా పోటీ వచ్చినప్పటికీ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  


సాధారణంగా ఏ సినిమాలైనా సరే థియేటర్లలో సందడి చేసిన ఆరువారాల తర్వాత కచ్చితంగా ఓటీటీ లోకి వస్తాయి. ఈ క్రమంలోని చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నెట్ఫ్లిక్స్ లో వస్తుందని చెప్పారు కానీ ఎప్పుడు వస్తుందని చెప్పలేదు.. ఈ క్రమంలోనే ఒక డేట్ ను కూడా లాక్ చేశారు నిర్వాహకులు. ఈనెల అనగా ఫిబ్రవరి 27వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ కానుంది. మరి సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమా ఏ రేంజ్ లో రేటింగ్ సొంతం చేసుకుంటుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: