ఇక కన్నడ సీనియర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ 'వేద' సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా చాలా గ్రాండ్ గా విడుదలవుతుండగా.. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య అతిథిగా విచ్చేసి మూవీ టీంకి తన విషెస్ ని తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమంలో బాల కృష్ణ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.అయితే ఈ ఫంక్షన్ లో తన తమ్ముడు లేట్ పునీత్ రాజ్ కుమార్ గారి ఏవీ చూడగానే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన శివన్నను ఒక అన్నలా ఓదార్చారు బాలకృష్ణ. తన ప్రసంగంలో ఎన్టీఆర్ - రాజ్ కుమార్ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. సినీ వారసత్వాన్ని కొనసాగించడం అనేది ఒక గొప్ప బాధ్యతని వారు చెప్పారు.ఇంకా అలాగే పునీత్ రాజ్ కుమార్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇక తరువాత శివన్న మాట్లాడుతూ.. బాల కృష్ణ పరిచయం గురించి చెప్పుకొచ్చారు.


ఇంతకుముందు తన ఫంక్షన్లకు వచ్చి బాల కృష్ణ బ్లెస్ చేశారని.. కానీ ఇప్పటి పరిస్థితిలో పిలవగానే ఆయన వచ్చారని.. తారక రత్నను బెంగుళూరు ఆసుపత్రిలో చూశానని.. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. ఇక అలాగే ఒక్క పాటతో సరిపోదు.. బాలయ్యతో పూర్తిగా ఓ సినిమా చేయాలి అనే కోరికను శివన్న బయట పెట్టారు. దీంతో.. అలాగే అన్నట్టు బాలయ్య కూడా వెంటనే తలూపారు.ఇక నటసింహ నందమూరి బాల కృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలో 'సింగముపై లఘించెను బాలుడు పేరు శాతకర్ణి' అనే పాటలో కనిపించారు హీరో శివ రాజ్ కుమార్. వీరి లాగే వీరి వారసులు జూనియర్ ఎన్టీఆర్, పునీత్ రాజ్ కుమార్‌ల మధ్య కూడా చాలా మంచి అనుబంధముంది. పునీత్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన 'చక్రవ్యూహ' సినిమాలో తారక్ 'గెలయా' సాంగ్ కూడా పాడాడు. అలాగే ఇటీవల 'కర్ణాటక రాజ్యోత్సవ' కార్యక్రమంలో కూడా తారక్ పాల్గొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: