టాలీవుడ్ లో బెస్ట్ పైర్ గా పేరు పొందిన జంటలలో విజయ్ దేవరకొండ, రష్మిక జంట కూడా ఒకటి. గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అడ్డుకున్న ఈ జంట దాదాపుగా ఈ సినిమా రూ.100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహించారు. ఇక ఆ తరువాత మళ్లీ రష్మీ ,విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. కానీ వీరిద్దరి నటన కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పవచ్చు.


గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి గీతగోవిందం సినిమా సీరియల్ రాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పరశురాం కూడా అందుకు సంబంధించి ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు వినిపిస్తూన్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్లు అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇటీవలే అల్లు అరవింద్, పరశురాం మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. దిల్ రాజు నిర్మాణంలో పరుశురాం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడం జరిగిందట.


ఈ సమయంలోనే అల్లు అరవింద్ ఏకంగా మీడియా సమావేశాన్ని పెట్టి మరి పరశురాం పైన తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది.. తన వద్ద అడ్వాన్స్ తీసుకొని స్క్రిప్ట్ కూడా రెడీ చేసి ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లు సినిమాను చేసేందుకు సిద్ధమయ్యారు అంటూ అల్లు అరవింద్ తన  సన్నిహితులతో ఆరోపించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వివాదం కాస్త పెద్దదిగా మారడంతో గీతగోవిందం సినిమా సీక్వెల్ ఉండకపోవచ్చు అని అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అల్లు అరవింద్ ,పరశురాం కలిసి వర్క్ చేసి అవకాశాలు కూడా లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో సినిమాలు వస్తాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: