తమిళ స్టార్ హీరో అజిత్ 'తునివు' సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అని ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూడగా ఈ సినిమా ఎట్టకేలకు  ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం తెలుగు భాష మాత్రమే కాదు హిందీలో కూడా ఈ వర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది, అదే విధంగా తమిళ వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రిలీజ్ కి ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ రికార్డ్ ధరలకు నెట్ఫ్లిక్  దక్కించుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే ఈ సినిమా నెట్ ఫ్లి్స్ ఓటిటి ప్లాట్ఫారంలో ఆ సినిమాతో పాటు విడుదల అయిన అన్ని సినిమాల కంటే ఎక్కువ వ్యూస్ తో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది.


ఇక సామాజిక అంశాన్ని జోడించి హెచ్ వినోద్ తునివు సినిమాని చక్కగా తెరకెక్కించగా డార్క్ డెవిల్ అనే ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ గా అజిత్ ఈ సినిమాలో కనిపించి అభిమానులు అందరినీ ఎంతగానో అలరించాడు. ఈ సినిమాలో అజిత్ క్యారెక్టర్ మాత్రమే కాదు ఆయన యాక్టింగ్ ఇంకా హీరోయిన్ మంజు వారియర్ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా సినిమాకి బాగా ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఈ సినిమాలో సముద్రఖని పాత్ర కూడా కీలకంగా మారింది.ఇక ఈ సినిమా కథ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ  క్రెడిట్ కార్డులు మ్యూచువల్ ఫండ్స్ పేరుతో ప్రజలను బ్యాంకులు ఎలా మోసాలకు చేస్తున్నాయి ఇంకా ప్రైవేట్ బ్యాంకులు నడుపుతున్న కొందరు వ్యక్తులు ప్రజల సొమ్మును ఎలా దోచుకుంటున్నారు అనే విషయాలను మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక తమిళ, తెలుగు భాషలో పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: