రీ రిలీజ్ ట్రెండ్ ఇంకా ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎన్టీఆర్ నటించిన మరొక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ అదుర్స్ సినిమా 13 ఏళ్ల తర్వాత మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా మార్చి 4వ తేదీన రి రిలీజ్ చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ తో పాటు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాగా అలరించాయి. ఇక ఎన్టీఆర్ బాద్షా కూడా గత ఏడాది నవంబర్లో రీ రిలీజ్ అయింది.

ఇక తాజాగా అదృష్ట సినిమా కూడా విడుదల కావడంతో అటు ఎన్టీఆర్ అభిమానులలో చాలా ఆనందం నెలకొంది. కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం  రూ.25 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా దాదాపుగా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ లో ఈ సినిమా కూడా ఒక బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందని చెప్పవచ్చు ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించారు. నరసింహ అనే అండర్ కవర్ ఏజెంట్గా మరొక పాత్ర చారి అనే పూజారిగా కనిపించారు.


ఎన్టీఆర్ ,బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. అప్పటివరకు సీరియస్ రూల్స్ లోనే నటించిన ఎన్టీఆర్ మొదటిసారి కామెడీ టైమింగ్ లో కూడా అదుర్స్ అనిపించేలా చేశారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఇందులో నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు కోన వెంకటేష్ చిత్రానికి కథను అందించారు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా లేవలో పేరును సంపాదించారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తన తదుపరిచిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా షూటింగ్ మార్చి 20 తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: