నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించినటువంటి వీర సింహారెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... హనీ రోజ్ ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దునియా విజయ్ ... వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించగా తమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల విడుదల అయ్యింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే మంచి విజయం అందుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా మెరబడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. 

అందులో భాగంగా ఈ మూవీని ఫిబ్రవరి 23 వ తేదీ న సాయంత్రం 6 గంటల నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" లో ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దామని మిస్ అయిన వారు ఉంటే ఫిబ్రవరి 23 వ తేదీ నుండి ఈ సినిమా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: