టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస మూవీ లతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న యువ హీరో లలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవారం తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ నుండి తిరుపతి అనే సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ... ఈ సాంగ్ విడుదల కార్యక్రమాన్ని ఇంద్ర మందిరం తిరుపతి లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్ "సమ్మతమే" మూవీ తో పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్నాడు. మరి వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ఎ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ మూవీ కి మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ యూనిట్ ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ వారి అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలి అంటే ఫిబ్రవరి 17 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: