ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు ప్రేమలో ఉన్నారు. ప్రేమలో ఉండడమే కాకుండా చాలామంది పెళ్లిళ్లు కూడా చేసుకొని సెటిల్ అయ్యారు. అయితే తాజాగా తన ప్రేమ గురించి షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది హీరోయిన్ అంజలి .తెలుగు తోపాటు తమిళంలో మరియు కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా మారి మంచి గుర్తింపును తెచ్చుకుంది అంజలి. జర్నీ సినిమాతో రెండు భాషల్లో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. దాని అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో స్టార్ హీరోయిన్ ముద్ర వేసుకుంది అంజలి. ఈ సినిమా తనకి బాగా ప్లస్ అయింది అని చెప్పాలి .

అయితే ఈ క్రమంలోనే అంజలికి హీరోయిన్ అవకాశాలు తగ్గాయి హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్న రోల్స్ మాత్రమే అంజలికి వస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి పాత్రలలోనే నటిస్తోంది ఈమె. అంతేకాదు ఈమధ్య ఐటెం సాంగ్ లలో కూడా చేస్తుంది. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక పోస్టును తన సోషల్ మీడియా వేదికదా షేర్ చేసింది అంజలి. ఇంట్లో సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తెలిసింది. అంతేకాదు తన పెట్తో కలిసి లవ్ షేప్ ఉన్న సింబల్స్ ను పెడుతూ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ చాలా సింపుల్ గా బెలూన్లతో తన లవర్ చేంజ్ రివీల్ చేసింది అంజలి. ఇంత పెద్ద క్యాప్షన్ రాసినప్పటికీ తన వాలెంటైన్ ఎవరు అనేది మాత్రం

బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలోని తను షేర్ చేసిన పోస్ట్ చూసిన చాలా మంది క్యాజువల్ గా అలా చేసిందా లేక ఎవరైనా ఉన్నారా లేకపోతే సింపుల్గా వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకున్నట్టు కవరింగ్ ఇచ్చిందా అంటూ చాలామంది భావిస్తున్నారు. అయితే గతంలో అంజలి తమిళ యంగ్ స్టార్ జర్నీ ఫేమ్ జై తో ప్రేమాయణం నడిపిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీంతో అంజలి షేర్ చేసిన ఈ పోస్ట్ ను చూసిన చాలా మంది మరోసారి అంజలి ప్రేమలో పడింది అంటూ కామెంట్లను చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అంజలి మాత్రం వర్ష సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక అంజలి తన ప్రేమ విషయాన్ని ఎప్పుడూ అధికారికంగా బయటపడుతుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: