యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెలుగు తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రకటించి చాలా కాలమే అయింది. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫాన్స్ అయితే సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. అలాంటి తన ఫ్యాన్స్ కి ఇటీవల అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భారీ క్లాస్ పీకాడు తారక్. ఏదైనా అప్డేట్ ఉంటే మా భార్యల కన్నా ముందు మీకే చెప్తామని.. అంతేకానీ ఇలా ఇబ్బంది పెట్టొద్దని ఎన్టీఆర్ చెప్పడంతో అప్పటినుంచి అభిమానులు సైలెంట్ అయిపోయారు. ఇక ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదికి వెళ్లిన ఈ సినిమా ఫిబ్రవరి 24న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతోంది.. దీంతో ఇప్పుడు ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. 

ఇక దాన్ని మరింత పెంచుతూ ఎన్టీఆర్ 30 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో చెక్కర్లు కొడుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫిబ్రవరి 24న ఈ మూవీ లాంచ్ అవుతుండగా.. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండబోతుందట. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్ ఎవరా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ 30 కోసం మొదట్లో అనుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ని కొరటాల శివ ఫైనల్ చేశారు. తాజాగా ఈమధ్య శంషాబాద్ లోని ఓ స్టూడియోలో జాన్వి కపూర్ తో కొరటాల శివ లుక్ టెస్ట్, ఫోటోషూట్ కూడా పూర్తి చేశాడని టాక్ వినిపిస్తోంది.

ఇక జాన్వి కపూర్ ఆ లుక్ టెస్ట్ లో కొరటాల శివని ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా తెలుగు వెండితెరకు పరిచయం అవుతుంది. అయితే ఈ విషయాన్ని ఫిబ్రవరి 24న చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుందట. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ఓ విలన్ గా నటించబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, మిక్కిలిని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: