ప్రముఖ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన ఈయన.. ఇటీవల రెమో, డాక్టర్ వంటి సినిమాలతో మంచి విజయం సాధించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. 1985 ఫిబ్రవరి 17వ తేదీన సింగం పునారి .. శివగంగ జిల్లా తమిళనాడులో జన్మించిన శివ కార్తికేయన్ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టాలు పడ్డారు. అలా ఇండస్ట్రీలోకి రాకముందు తమిళ టీవీ అయిన విజయ్ టీవీలో వ్యాఖ్యాతగా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని షోలకు హోస్టుగా పనిచేసిన ఈయన నిర్మాతగా , గాయకుడిగా, గీతా రచయితగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇకపోతే ఈయన చురుకుదనాన్ని గమనించిన దర్శకుడు పాండియరాజన్ మెరీనా చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇందులో సెంతిల్ నాదన్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.  2012 నుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈయన తాజాగా డాన్, ప్రిన్స్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని మరింతగా మెప్పించాడు.  ఇకపోతే తాజాగా ఆయన మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకటి అయలన్.. మరొక చిత్రం మావీరన్.. ఇకపోతే అయలన్ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.  త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోందని సమాచారం.

ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే 2010లో ఆర్తి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా వారికి ఒక కూతురు కూడా జన్మించింది. ప్రస్తుతం ఆయన వయసు 38 సంవత్సరాలు ఇప్పుడిప్పుడే తన సినీ కెరియర్లో సరికొత్త మలుపులు తీసుకుంటూ మరింత ఇమేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నారు శివ కార్తికేయన్ త్వరలోనే మరొక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు ,తమిళ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన శివ కార్తికేయన్ అటు బాలీవుడ్ లో కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: