కృష్ణంరాజు వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్ .అనంతరం వరస సినిమాలను నటించి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ మధ్యలో ఆయన చేసిన రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా డిజాస్టర్లు అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఇకపోతే ప్రభాస్ 4 పదులు వయసు దాటినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో తరచూ ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా చాలామంది హీరోలు ఉన్నారు. కానీ ఈ మధ్య మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న చాలామంది హీరోలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. 

కానీ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. దీంతో అందరూ ప్రభాస్ పెళ్లి గురించి అడుగుతుండడంతో ఆ వార్తలు వస్తే వాటిని దాటేస్తూ నెట్టుకు వస్తున్నాడు ప్రభాస్. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం పక్కన పెట్టకుండా తరచూ ప్రభాస్ పెళ్లి గురించి నిలదీస్తూనే ఉన్నారు. చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ నడుపుతూ ఉన్నాడు అని ఇప్పటికే చాలా వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అన్ని వార్తలు వచ్చినప్పటికీ వాటిలో ఒక్క నిజం కూడా లేదు. గతంలో త్రిశతో ప్రభాస్ కి ఎంగేజ్మెంట్ కూడా అయింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ అది కూడా నిజం కాదు.దాని అనంతరం అనుష్కతో కూడా ప్రభాస్ ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

 దీంతో చాలామంది నిజంగా అనుష్క ప్రభాస్ల మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ నమ్మారు. కానీ ఈ మధ్యకాలంలో కృతిసినంతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు త్వరలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి .ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ భార్యగా ఇంటికి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలో తన తల్లి గతంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ ఇంటికి ఇల్లాలుగా వెళ్లే అమ్మాయి ఎవరైనా సరే గాని చాలా సాంప్రదాయబద్ధంగా ఉండాలని.. అదే చాలా ముఖ్యమైన విషయమని ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలి అని.. ఒక కండిషన్ పెట్టారట. ప్రస్తుతం ప్రభాస్ తల్లి ప్రభాస్ పెళ్లికి ఈ కండిషన్ పెట్టడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: