కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన మొదటి బైలింగువల్ సినిమా 'సార్'. 'తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే' లాంటి సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు.ఇక ఈరోజు విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..సింపుల్ గా కథ విషయానికి వస్తే..బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు సార్ (ధనుష్) త్రిపాఠి అనే విద్యాసంస్థలో ఓ జూనియర్ లెక్చరర్. ఇక త్రిపాఠి విద్యాసంస్థల సీఈఓ త్రిపాఠి (సముద్రఖని) గవర్నమెంట్ కళాశాలను డెవలప్ అవ్వకుండా చేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్ లో భాగంగా బాలుని సిరిపురంలోని ప్రభుత్వ కళాశాలకు ట్రాన్స్ఫర్ ఇక ఇదేమీ తెలియక సిరిపురంలో పాఠాలు చెప్పడం మొదలుపెట్టిన బాలు..సమాజంలో విద్యా వ్యవస్థకు పట్టిన చీడ లాంటి ప్రైవేటీకరణను ఎలా ఎదిరించాడు? విద్యార్ధులను ఏ విధంగా విద్యావంతులుగా చేసి తీర్చిదిద్దాడు? అనేది 'సార్' సినిమా కథ.


ఇక ధనుష్ గురించి తెలిసిందేగా. చాలా ఈజీగా ఎలాంటి పాత్రలో అయినా జీవించడం ధనుష్ కు వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాలో కూడా మాష్టార్ గా చాలా చక్కగా ఆకట్టుకున్నాడు. ఎప్పట్లానే ఎమోషనల్ సీన్స్ లో ధనుష్ కంటతడి పెట్టించాడు. ఒక మామూలు సన్నివేశాన్ని, ఓ నటుడు తన హావభావాలతో ఏ విధంగా ఎలివేట్ చేయగలడు అనేందుకు 'సార్' సెకండాఫ్ లో ధనుష్ నటన ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.హీరోయిన్ విషయానికి వస్తే..సంయుక్త మీనన్ గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో బాగానే నటించింది. ఆమెకు మంచి పాత్ర దొరికింది.చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ సీనియర్ నటుడు సాయికుమార్ ఒక అర్ధవంతమైన పాత్రలో కనిపించాడు. సముద్రఖని ఎప్పట్లానే తన విలనిజాన్ని చూపించి ఎక్కువ కష్టపడకుండా స్మార్ట్ వర్క్ చేసి పండించి పర్వాలేదనిపించుకున్నాడు. ఆడుకాలం నరేన్, హైపర్ ఆది, రాజేంద్రన్ తదితరులు తమ తమ పాత్రలకు కొంచెం బాగానే న్యాయం చేశారు.పాటలు, నేపధ్య సంగీతం, కెమెరా వర్క్ సూపర్.ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. మంచి సందేశాత్మక సినిమా. ధనుష్ కి తెలుగులో మంచి మూవీ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి డీసెంట్ మూవీ ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: