సీనియర్ హాట్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్‌గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి.. తమిళ ఇంకా తెలుగు ఇండస్ట్రీలలో తన హాట్ అందాలతో ఎంతగానో ఆకట్టుకొని పెద్ద స్టార్ హీరోయిన్‌గా ఎదిగి.. దాదాపు దశాబ్దానికి పైగా సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది.చాలా తక్కువ టైంలోనే తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ ఇంకా మలయాళం భాషల్లో మూవీస్ చేసిన పాన్ ఇండియా యాక్ట్రెస్ గా ముద్ర వేసుకుంది సిమ్రాన్.. దాదాపు స్టార్ హీరోలందరితో కూడా ఆమె ఆడి పాడింది.. ఇక తెలుగులో మహానటి సావిత్రి తర్వాత సౌందర్య ఎలాగో.. ఆమె తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ పొందుకుంది.. అందం, అభినయంతో పాటు సిమ్రాన్ అదిరిపోయే డాన్స్ తో కూడా ఆకట్టుకుంది.ఇక సిమ్రాన్ స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది..


ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను పెళ్లి చేసుకుంది.. వీరికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు.. టెలివిజన్‌లో కూడా అలరించిన సిమ్రాన్.. తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది..అయితే తెలుగులో మాత్రం 2008లో కృష్ణ భగవాన్ పక్కన నటించిన 'జాన్ అప్పారావ్ 40 ప్లస్' ఆమె చివరి చిత్రం..ఇక ఆ సినిమా తరువాత ఆమె మరో తెలుగు సినిమా చెయ్యలేదు. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ విషయాలన్నిటినీ షేర్ చేస్తుంటుందామె.. 47 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా హాట్ గా ఆమె గ్లామర్ చాలా చక్కగా మెయింటెన్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..తెలుగులో నాగార్జున, బాల కృష్ణ, హరి కృష్ణ, మహేష్ బాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి ఎంతగానో మెప్పించింది సిమ్రాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: