చిత్ర పరిశ్రమ సినిమా రంగానికి చెందిన కొంతమంది సెలబ్రిటీలు ఆస్తులను సంపాదించుకోవడంపై ఫోకస్ పెడితే మరి కొందరు మనుషులను సంపాదించుకోవడంపై దృష్టి పెడతారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీహరి మంచితనం గూర్చి కథలుకథలుగా చెప్పుకుంటారు.ఆయన ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే శ్రీహరి తన వంతు సహాయం చేశారు. ఐతే ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందింది.సమాచారం.

ఐతే ఒక ముఖ ముఖి సంభాషణలో శ్రీహరి భార్య డిస్కో శాంతి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది.ఐతే శ్రీహరికి కోపం ఎక్కువని చాలామంది అనుకుంటారని ఆయనకు నిజ జీవితంలో కోపం అస్సలు రాదని ఆమె గట్టిగా చెప్పారు. ఐతే శ్రీహరిగారు అందరినీ నమ్ముతారని ఆయనలో నచ్చిన లక్షణం కూడా అదేనని ఆయన భార్య డిస్కో శాంతి పేర్కొన్నారు. ఐతే ఎవరొచ్చి ఏది చెప్పినా నమ్ముతారని ఒకవేళ వచ్చింది దొంగ అని చెప్పినా ఆయన మర్యాద చేస్తారని డిస్కోశాంతి అన్నారు. శ్రీహరికి చిన్నకొడుకు అంటే ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపారు. గొడవ పడితే శ్రీహరి మొదట రాజీ పడేవారని డిస్కో శాంతి తెలిపారు. శ్రీహరిని నేను బావ అని పిలుస్తానని ఆయన కూడా నన్ను బావ అని పిలుస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ఐతే ఆయన హీరో అయ్యే వరకు శ్రీహరి మూవీస్ లను నేను చూడలేదని డిస్కో శాంతి పేర్కొన్నారు.ఆయన  గొప్పోడని చిత్ర పరిశ్రమలో చాలామంది అంటుంటారు.హీరోగా శ్రీహరి వరుసగా తొమ్మిది విజయాలను అందుకున్నారు.ఐతే ఇది శ్రీహరి గారికి ఒక రికార్డు గా మిగిలి పోయింది. ఐతే సినిమా ఇండస్ట్రీలో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోల సంఖ్య చాలా తక్కువేనని చెప్పాలి. ఐతే ఆయన చేసిన వాటిల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర సినిమాలలోని పాత్రలకు శ్రీహరి కాకుండా మరొకరు న్యాయం చేసేవారు కాదు. ఐతే ఈ జనరేషన్ లో కూడా శ్రీహరిక గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న వయస్సులోనే శ్రీహరి మరణం చాలా మందిని బాధ పెట్టింది.ఐతే ఆయన మరణం ఇండస్ట్రీ కి తీరని లోటు గా మిగిలి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: